Prabhas , Hanu Raghavapudi: ప్రభాస్ – హను.. క్రేజీ డీల్ సెట్టయినట్లే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే హను రాఘవపూడితో (Hanu Raghavapudi)  కలిసి ఒక కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించిన ప్రభాస్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సంచలన డీల్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ కథతో రూపొందే ఈ చిత్రం నేషనల్ వైడ్‌గా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించగా, అప్పటి నుంచే ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas , Hanu Raghavapudi:

ఇదిలా ఉంటే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే ఒక బడా సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభాస్ సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ పిరియాడిక్ మూవీ హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయని, చివరకు ఒక ప్రముఖ సంస్థ రూ. 150 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి కాక ముందే ఈ రేంజ్ లో రైట్స్ సొంతం కావడం, ఆ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. ఇందులో హీరోయిన్‌గా ఇమాన్వీ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని (Naveen Yerneni) , యలమంచిలి రవిశంకర్ (Ravi Shankar) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar)   పనిచేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథ ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

అక్కడ నేను బలి పశువు అయ్యాను.. చిన్మయి ఎమోషనల్ కామెంట్స్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus