Balakrishna: నిర్మాతగా సత్తా చూపనున్న బాలయ్య.. తొలి ప్రాజెక్ట్ అతనితోనేనా?

  • May 27, 2022 / 12:39 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ కేవలం నటుడు మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తన సత్తా ఏంటో చూపించారు. హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా తనలో మంచి యాంకర్ కూడా దాగి ఉన్నారని అందరికీ అర్థమైంది. ఇక ఈ కార్యక్రమం ఎంత మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో హీరోగా,హోస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ ఒక నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణ సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు బసవ తారకరామ క్రియేషన్స్‌ అనే పేరుతో బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలయ్య సొంత బ్యానర్ ప్రారంభించడంతో ఈ బ్యానర్ లో ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తారనే విషయం గురించి అభిమానులు చర్చలు జరుపుతున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య తన బ్యానర్ లో ఎలాంటి చిత్రాలను తెరకెక్కిస్తారని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే తన బ్యానర్ గురించి ప్రకటించిన బాలకృష్ణ తన బ్యానర్ లో తొలి ప్రాజెక్టు గురించి తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పూర్తి వివరాలను తెలియ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ తన సొంత బ్యానర్ లో తొలి ప్రాజెక్టుగా తన కొడుకు సినిమానే ప్రకటిస్తారని భావిస్తున్నారు.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాలి.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బాలకృష్ణ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి సినిమాతో బాలయ్య బిజీ కానున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus