Balakrishna: బాలకృష్ణ ఇమేజ్‌ని ఇంతలా వాడుకున్నది అల్లు అరవింద్‌ ఒక్కరే!

‘గాలా విత్‌ బాలా’.. పేరు భలే క్యాచీగా ఉంది కదా? బాలకృష్ణను పట్టుకుని ఆహా టీమ్‌ చేస్తున్న పనులన్నీ ఇలానే ఉంటున్నాయి. ‘అన్‌స్టాపబుల్‌’షోకి బాలయ్యను హోస్ట్‌గా చేసి తొలి హిట్‌ కొట్టిన ఆహా టీమ్‌ ఆ తర్వాత వరుసగా ఇలాంటి ప్రత్యేకమైన పనులు చేస్తూ వస్తోంది. ఆహా ఓటీటీకి బాలయ్యను ఏకంగా బ్రాండ్‌ అంబాసిడర్‌ను చేసేసింది అనే చెప్పాలి. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కానీ.. జరుగుతోంది ఇదే అని చెప్పాలి. ‘ఇండియన్‌ ఐడల్‌ 2’ కొత్త ఎపిసోడ్‌ కోసం బాలయ్యను బాగానే వాడేసుకున్నారు.

ఓటీటీ సంస్థల మధ్య ఉన్న గట్టి పోటీ వల్లనో, లేక బాలయ్య ఓటీటీ ఇమేజ్‌ బాగా క్యాష్‌ చేసుకుందామనో కానీ అల్లు అరవింద్‌ అయితే ఎక్కడా తగ్గడం లేదు. ఆహా ఓటీటీని పెట్టినప్పుడు అల్లు అర్జున్‌ను, కొంత భాగస్వామి (?) అయిన విజయ్ దేవరకొండను బాగానే వాడుకున్నారు. ఆహా జనాలకి రీచ్ చేయడంలో వీరిద్దరూ బాగా సాయపడ్డారు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలతో బండి లాగింది చాలు అనుకున్నారేమో మరింతగా జనాల్లోకి పెంచుకునే క్రమంలో బాలయ్యను బలంగా రంగంలోకి దింపారు అని అర్థమవుతోంది.

అన్‌స్టాపబుల్‌ షోకి సంబంధం లేకుండా మధ్యలో బాలయ్యను సింగర్స్ షో అయిన ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ సీజన్ 1కి గెస్ట్‌గా తీసుకొచ్చారు. ఇప్పుడు మరోసారి అదే షోకి తీసుకొచ్చారు. అయితే ఈసారి ‘గాలా విత్‌ బాలా’ అనే పేరు పెట్టారు. ఇందులో ఓ సాంగ్‌కి బాలయ్య డ్యాన్స్‌ కూడా చేశాడు. ఇదంతా చూస్తుంటే బాలయ్యను ఆహా బాగానే వాడుకుంటోంది అని అర్థమవుతోంది.

దీనికి వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌ అల్లు అరవింద్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గ్రాండ్‌ ఫినాలేకి చిరంజీవిని తీసుకొచ్చి ఇంకాస్త మజా యాడ్‌ చేస్తుంటారు ఆయన. మరి ఈసారి కూడా అదే ఫార్ములా వాడతారా? లేక ఇంకేమైనా ప్లాన్‌ చేస్తారా అనేది చూడాలి. అయితే అల్లు అర్జున్‌తో ఏదో స్పెషల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. దాని వివరాలు త్వరలో తెలుస్తాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus