సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఎన్నో అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ సినిమాలు ఫ్యాన్స్ ను అంచనాలకు మించి మెప్పించాయి. నాలుగు రోజుల్లో వీరసింహారెడ్డి మూవీ 104 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా మూడు రోజుల్లో వాల్తేరు వీరయ్య 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా ఫస్ట్ వీకెండ్ లోనే నిర్మాతలకు ఏకంగా 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
ఈ వారం థియేటర్లలో క్రేజ్ ఉన్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అందువల్ల ఈ వారం కూడా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య వీరాభిమానినని చెప్పుకున్న గోపీచంద్ మలినేని చిరంజీవి వీరాభిమానినని చెప్పుకున్న బాబీ ఫ్యాన్స్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలలో ఎలివేషన్ సీన్లు మామూలుగా లేవని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రెండు సినిమాలలో కొన్ని మైనస్ లు ఉన్నా చిరంజీవి, బాలయ్య తమ నటనతో ప్రేక్షకులు వాటిని మరిచిపోయేలా చేశారు. ఈ రెండు సినిమాలు చిరంజీవి, బాలయ్య క్రేజ్ కు నిదర్శనమని చిరంజీవి, బాలయ్య మార్కెట్ ను ఈ సినిమాలు మరింత పెంచాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు మినహా సంక్రాంతికి విడుదలైన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. బడ్జెట్ బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్లను సాధించాయనే చెప్పాలి.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు లాంగ్ రన్ ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ సినిమాలను నమ్ముకుని భారీగా పెట్టుబడులు పెట్టిన బయ్యర్లకు భారీ స్థాయిలోనే లాభాలు వస్తున్నాయని సమాచారం. టికెట్ రేట్ల పెంపు వల్ల కూడా ఈ సినిమాలకు మేలు జరిగిందని కొంతమంది చెబుతున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?