స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రాజకీయాల్లో సత్తా చాటుతూ హిందూపురం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ మరోమారు అధికారంలోకి వస్తే బాలయ్యకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. అయితే బాలయ్య కూతురు బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి రానున్నారని సమాచారం అందుతోంది. చంద్రబాబు అరెస్ట్ తో బ్రాహ్మణి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా వైరల్ అవుతుండగా ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
గుంటూరు నుంచి బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గుంటూరు లోక్ సభ పరిధి నుంచి బ్రాహ్మణి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే టీడీపీకి ప్లస్ అవుతుందని పొలిటికల్ లెక్కల్ని మార్చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నారా బ్రాహ్మణి వాక్చాతుర్యానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నారా బ్రాహ్మణి మాత్రం పొలిటికల్ ఎంట్రీ గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు.
నారా బ్రాహ్మణి (Brahmani) మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. నారా బ్రాహ్మణి ప్రస్తుతం వ్యాపారవేత్తగా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య సైతం ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉంటూ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!