Balakrishna: అలాంటి కథలే కావాలంటున్న బాలకృష్ణ..?

నందమూరి బాలకృష్ణ సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని బాలకృష్ణ అఖండ సినిమాతో సక్సెస్ సాధించి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా తరువాత బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ హారిక హాసిని బ్యానర్ లో ఒక సినిమాచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న హారిక హాసిని సంస్థ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య సినిమాను నిర్మించాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం హైవోల్టేజ్ స్టోరీ కావాలని ఈ సంస్థ ప్రముఖ రచయితలను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

అయితే ఎన్టీఆర్ నో చెప్పిన బ్యానర్ కు బాలయ్య యస్ చెప్పడం గమనార్హం. ఈ సంస్థ నిర్మాతలు బాలయ్య డేట్స్ ను ఇప్పటికే లాక్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ సైతం ఇకపై పవర్ ఫుల్ కథల్లోనే నటించి విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus