‘నా అభిమానులు ఒక్క చిటికేస్తే చాలు.. జాగ్రత్తగా ఉండు’.. అంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చింది ఎవరికంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ భోళా శంకరుడు.. కల్మషం తెలియదు.. కోపం, ప్రేమ ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు అని చాలామంది చెప్తుంటారు.. నిజంగానే తెరమీదే కాదు తెరవెనుక కూడా ఆయనకు నటించడం తెలియదు.. ఇప్పటికే చిరాకు తెప్పించిన ఫ్యాన్స మీద చేయి చేసుకోవడం.. మనసులో అనిపించింది మైకులో చెప్పేయడం.. తర్వాత కాంట్రవర్సీలు రావడం.. కొన్ని సార్లు క్లారిటీ ఇవడం లాంటి సంఘటనలు జరిగాయి..

రీసెంట్‌గా ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్నేకి తన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య.. ‘ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా’.. అంటూ ఫైర్ అయ్యారు.. వివరాల్లోకి వెళ్తే.. నటరత్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ రెడ్డికి ‘ఎన్టీఆర్’ అవార్డులను అందజేశారాయన..

జన్మనిచ్చి, అభిమానుల గుండెల్లో స్థానం కల్పించిన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉందని చెప్పిన బాలయ్య.. సావిత్రి, నాగి రెడ్డి గార్ల గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.. ఈ సందర్భంగా బాలయ్య ఇటీవల జరిగిన ఓ సంఘటన గురించి స్పందించారు.. పరోక్షంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై విమర్శలు గుప్పించారు..

ఇటీవల జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో అధికార పార్టీకి చెందిన భాస్కర్ రెడ్డి అనే కార్యకర్త బాలకృష్ణ సాంగ్స్ ప్లే చేశాడు.. ‘బాలయ్య పాటలు పెడతావా’ అంటూ ఎమ్మెల్యే అతడిని వేధించాడు.. దీంతో మనస్తాపానికి చెందిన భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటిముందే ఆత్మహత్యాయత్నం చేశాడు.. పోలీసులు, పార్టీవారు నచ్చజెప్పి పంపించేశారు..

ఈ విషయం గురించి నటసింహా సీరియస్ అయ్యాడు.. సదరు ఎమ్మెల్యే పేరు తీయకుండానే వార్నింగ్ ఇచ్చాడు.. ‘‘నరసరావుపేటలో నా సినిమా పాట వేశారని వైసీపీ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారు. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శిస్తే నేను రెడీ.. రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దు, సినిమాను సినిమాలాగా చూడాలి, సినిమాను అన్ని పార్టీల వారు, కులాల వారు చూస్తారు.. అందరి సినిమాలు చూస్తారు’’ అన్నారు.. మాటల మధ్యలో.. ‘ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా’.. ‘నా అభిమానులు ఒక్క చిటికేస్తే చాలు.. జాగ్రత్తగా ఉండు’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు బాలయ్య..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus