Balakrishna: ఆ ప్రశ్నలకు బాలయ్య సమాధానం ఇస్తారా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో జై బాలయ్య పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోయినా ఈ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తైంది. అయితే ఈ సినిమా రిలీజయ్యేది ఎప్పుడనే ప్రశ్నకు మాత్రం చిత్రయూనిట్ నుంచి స్పష్టత రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా పండుగ కానుకగా రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది.

ఇక బాలయ్య నుంచి మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలని కొత్త ప్రాజెక్ట్ ఎప్పటినుంచి మొదలవుతుందో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య చేసే ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా లెజెండ్2 అని కొంతమంది చెబుతుంటే అఖండ2 అని మరి కొందరు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ గురించి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు బాలయ్య నుంచి ఎప్పుడు సమాధానం లభిస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇతర స్టార్ హీరోలలా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వాలని బాలయ్య డిమాండ్ చేయడం లేదు. నిర్మాతల హీరోగా బాలయ్య గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.

సినిమాసినిమాకు బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కమర్షియల్ కథలతో పాటు ప్రయోగాత్మక కథలలో కూడా బాలయ్య నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus