Balakrishna: మనసున్న మారాజు బాలయ్య.. ఏం చేశారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ ను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించకపోయినా బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. సీడెడ్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి సినిమా హవా కొనసాగుతోంది. బాలయ్య ఫ్యాన్స్ మళ్లీమళ్లీ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ శుక్రవారం రోజున ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తాజాగా రిలీజైన ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ తో మరోసారి ఆహా ఓటీటీ రేంజ్ మరింత పెరగడంతో పాటు సబ్ స్క్రిప్షన్లు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బాలకృష్ణ తాజాగా క్యాన్సర్ పేషెంట్ కు సహాయం చేసి మంచి మనస్సు చాటుకున్నారు. అనంతపురంకు చెందిన ఇంటర్ స్టూడెంట్ బోన్ క్యాన్సర్ తో బాధ పడుతుండగా చికిత్సకు పది లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో చికిత్సకు డబ్బు లేక విద్యార్థిని తల్లీదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అభిమాన సంఘం ద్వారా ఈ విషయం తెలిసిన బాలయ్య బసవతారకం ఆస్పత్రి ద్వారా ఆ విద్యార్థినికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానులు బాలయ్య మనస్సు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ మనసున్న మారాజు అని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య దేవుడని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus