Balayya Babu: బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త ఇదే!

బాలకృష్ణ గతేడాది అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన అఖండ 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి 2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జై బాలయ్య సినిమాలో నటిస్తున్నారు.

జై బాలయ్య టైటిల్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినా ఈ టైటిల్ నే సినిమాకు ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ హంట్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దసరా కానుకగా ఈ సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ కానుందని బోగట్టా.

ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాలనే ఆలోచనతో చిత్రయూనిట్ మరో టీజర్ పై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. మొదట రిలీజైన టీజర్ ను మించి ఈ టీజర్ ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది డిసెంబర్ లో జై బాలయ్య మూవీ థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా అధికారికంగా ఈ మేరకు ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖండ సినిమాతో వచ్చిన క్రేజ్ ను తర్వాత సినిమాలు మరింత పెంచే విధంగా బాలయ్య జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus