NBK107: బాలయ్య గోపీ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

బాలయ్య కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరడంతో పాటు ఈ సినిమాతో బాలయ్య మార్కెట్ పెరిగిందనే సంగతి తెలిసిందే. గతంలో కొత్త డైరెక్టర్లకు, పెద్దగా గుర్తింపు లేని డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చి విమర్శలపాలైన బాలకృష్ణ అఖండ సక్సెస్ తర్వాత ఆ తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ మొదటివారంలో విడుదల కానుంది. గతేడాది డిసెంబర్ నెల 2వ తేదీన అఖండ సినిమా విడుదలై సంచలన విజయం సాధించగా ఈ ఏడాది బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ అదే తేదీకి విడుదల కానుందని తెలుస్తోంది. జై బాలయ్య అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య తర్వాత సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్యను గతంలో ప్రేక్షకులు చూడని పాత్రలో అనిల్ రావిపూడి ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

అఖండ సక్సెస్ సాధించినా బాలయ్య పారితోషికాన్ని భారీగా పెంచలేదు. కెరీర్ విషయంలో స్టార్ హీరో బాలకృష్ణ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus