Balakrishna Remuneration: బాలయ్య పారితోషికం.. ఎంతంటే..?

  • November 5, 2022 / 05:36 PM IST

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో కాస్త డీలా పడ్డ సమయంలో ‘అఖండ’ రూపంలో భారీ హిట్టు దక్కింది. ఈ సినిమా తరువాత బాలయ్య క్రేజ్, రేంజ్ రెండూ పెరిగిపోయాయి. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మొదట బాలయ్యకు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలనుకున్నారు.

కానీ ‘అఖండ’ బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య తన పారితోషికం రివైజ్ చేసి రూ.12 కోట్లు ఫిక్స్ చేశారు. ఆయన చెప్పినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. బాలయ్య తను ఒప్పుకునే కొత్త సినిమాలకు ఇదే రేటు చెబుతున్నారని సమాచారం. అనిల్ రావిపూడి సినిమాకి కూడా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా రివైజ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడే దానిపై క్లారిటీ వచ్చేలా లేదు.

సినిమా మొదలవ్వాలి… పూర్తి కావాలి. అప్పటి పరిస్థితిని బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. బాలయ్య తన రెమ్యునరేషన్ పెంచినా.. మిగిలినవాళ్లతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలందరూ ఇరవై కోట్లకు పైగానే తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే నలభై నుంచి యాభై కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నారు.

కానీ బాలయ్య మాత్రం తన సినిమాల బడ్జెట్, మార్కెట్ ను బట్టి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. వచ్చే ఏడాదిలో అనిల్ రావిపూడి సినిమా పూర్తి చేసి.. తన కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయాలనుకుంటున్నారు బాలయ్య.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus