Balakrishna: తారక రామారామ థియేటర్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపిన బాలయ్య!

  • December 15, 2022 / 03:22 PM IST

నందమూరి నట సింహం బాలకృష్ణ ఆయన చేతుల మీదుగా కాచిగూడలో ఉన్నటువంటి తారకరామా థియేటర్ ను తిరిగి ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ థియేటర్ పున ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ ఈ థియేటర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా థియేటర్ తో తమకు ఉన్న అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చారు. ఏషియన్ వారితో కలిసి తారకరామా థియేటర్ సరికొత్త హాంగులతో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ థియేటర్ కి ఓ చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు.

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా తల్లి జ్ఞాపకార్థం నిర్మించాము. అది మాకు దేవాలయంతో సమానం అలాగే ఈ థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మ నాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్ ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఇక ఈ థియేటర్ 1978లో ప్రారంభించాం అక్బర్ సలీం అనార్కలీతో ఇది మొదలైంది. అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. 1995లో మరోసారి ఈ థియేటర్ ప్రారంభించాం ఇప్పుడు మూడోసారి సరికొత్త హంగులతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిందని బాలయ్య తెలిపారు.

డాన్ సినిమా ఇక్కడ ఏకంగా 525 రోజులు ఆడింది. అలాగే తన సినిమాలు కూడా ఈ థియేటర్ లో ఘన విజయాన్ని అందుకున్నాయని బాలయ్య తెలిపారు. ఇకపోతే ఈ థియేటర్ కి మోక్షజ్ఞకు ఒక విడదీయరాని అనుబంధం ఉందని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. తన తండ్రి గారు తనకు కుమారుడు పుట్టిన తర్వాత ఇదే థియేటర్ లోనే మోక్షజ్ఞకు పేరు పెట్టారని అప్పటి విషయాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇక ఏషియన్స్ వారితో కలిసి తమకు ఎంతో మంచి అనుబంధంగా ఉందని,వారితో కలిసి తారక రామారావు థియేటర్స్ తిరిగి ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus