Balayya Babu: ఆ విషయంలో బాలయ్యకు పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నారా?

ఒకప్పుడు స్టార్ హీరోలు వెండితెరకే పరిమితమయ్యేవారు. బుల్లితెర షోలకు, ఓటీటీలకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం వెండితెర కంటే బుల్లితెర, ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటీటీలలో షోలను, సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే అన్ స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్ ను మించి సెకండ్ సీజన్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య హోస్టింగ్ ఈ షోకు ప్లస్ అయిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య హోస్ట్ గా కొనసాగినన్ని రోజులు అన్ స్టాపబుల్ షోకు తిరుగులేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య హోస్ట్ గా భవిష్యత్తులో కెరీర్ ను కొనసాగించాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఈ షో కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ షూట్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ షో సీజన్2 కు బాలయ్య ఎక్కువ సంఖ్యలో డేట్లు కేటాయించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య వీరసింహారెడ్డి సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బాలయ్య 62 సంవత్సరాల వయస్సులోనూ రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. బాలయ్య మాస్ మసాలా సినిమాలకు ఓటేస్తుండగా ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా మెప్పిస్తున్నాయి.

అఖండ సినిమా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సాధించగా వీరసింహారెడ్డి ఆ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. వీరసింహారెడ్డి సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉండగా శృతి హాసన్ ఇప్పటివరకు పోషించని తరహా పాత్రను ఈ సినిమాలో పోషించారని సమాచారం అందుతోంది.హోస్టింగ్ విషయంలో బాలయ్య తరహాలో హోస్ట్ చేసి మెప్పించే వాళ్లు చాలా తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus