Balakrishna: బిగ్ బాస్ లో బాలయ్య.. దబిడి దిబిడే!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్5 ముగిసింది. బిగ్ బాస్ సీజన్5 విజేతగా వీజే సన్నీ నిలిచారు. యువత ఎక్కువగా అభిమానించే బిగ్ బాస్ షో సీజన్5 ముగియడంతో బిగ్ బాస్ అభిమానులు నిరాశపడుతున్నారు. వీక్ డేస్ లో రాత్రి 10 గంటల సమయంలో ప్రసారమైనా బిగ్ బాస్ షోకు ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. అయితే బిగ్ బాస్ సీజన్5 తర్వాత ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించకూడదని నాగ్ ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి.

ప్రేక్షకులు సైతం గత మూడు సీజన్లకు నాగ్ హోస్ట్ గా వ్యవహరించడంతో కొత్త హోస్ట్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి నుంచి ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున సైతం బిగ్ బాస్5 ఫినాలే ఎపిసోడ్ లో మరో రెండు నెలల్లో తర్వాత సీజన్ ప్రారంభమవుతుందని హింట్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీకీ బాలయ్య హోస్ట్ కావచ్చని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ తన హోస్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు. బాలయ్య వల్ల ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని వార్తలు వస్తున్నాయి. బాలయ్య బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తే షోపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు బాలయ్య పేరును పరిశీలిస్తున్నారని అయితే బాలయ్య ఈ షోపై ఆసక్తి చూపుతారో లేదో తెలియాల్సి ఉందని సమాచారం.

బాలయ్య బిగ్ బాస్ షోకు వస్తే మాత్రం దబిడి దిబిడే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షో హోస్ట్ ఎవరో క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ కాలానికి అనుగుణంగా కథల విషయంలో జాగ్రత్త పడుతూ సినిమాలను ఎంచుకుంటున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus