Balakrishna: ఉగాది పోస్టర్లలో టాప్ లో నిలిచింది బాలయ్య మాత్రమేనా?

ఉగాది పండుగ కానుకగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలలో చాలా సినిమాలకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. ఆ అప్ డేట్స్ సినిమాలపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. అయితే ఉగాది పోస్టర్లలో టాప్ పోస్టర్ ఏదనే ప్రశ్నకు మాత్రం బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ పోస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. లుక్స్ విషయంలో బాలయ్య మాత్రమే కింగ్ అయ్యారని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య లుక్ రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాను గుర్తు చేసేలా ఉందని అనిల్ రావిపూడి పోస్టర్ తోనే అంచనాలను పెంచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కాజల్, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రీఎంట్రీలో కాజల్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాజల్ రీఎంట్రీకి కూడా ఈ సినిమా కచ్చితంగా ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాజల్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

బాలయ్య పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. వరుస మాస్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న బాలయ్య సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus