Balakrishna , Jr NTR: అవి కూడా కావాలంటున్న నందమూరి ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా మేకర్స్ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మాస్ కంటెంట్ ఎక్కువగా వచ్చింది.

ఊరమాస్ ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా వెల్లడైంది. మరోవైపు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 1980 నుంచి 1990 మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. ఈ సినిమా కుడా పూర్తిస్థాయిలో మాస్ కంటెంట్ ఉండనుందని సమాచారం అందుతోంది. అయితే ఈ రెండు సినిమాల నుంచి క్లాస్ ప్రేక్షకులను మెప్పించే అప్ డేట్స్ వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఊరమాస్ కంటెంట్ ప్రమోషన్స్ వల్ల ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాలను చూడటానికి ఆసక్తి చూపరని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఫ్యాన్స్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ జాగ్రత్త పడితే బాగుంటుంది. మరోవైపు నందమూరి హీరోలకు క్రేజ్ పెరుగుతోంది. బాబాయ్ అబ్బాయ్ కలిసి నటిస్తే మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

(Balakrishna) బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుండగా ఈ సినిమాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా బాలయ్య పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus