Aditya 369: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌.. కొత్త అప్‌డేట్‌ ఇదే.. చూస్తుంటే ఈ ఏడాదే…!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నా.. ‘ఆదిత్య 369’  (Aditya 369)  సినిమాను బీట్‌ చేసేది రాదు. ఎందుకంటే ఆ టైప్‌ సైన్స్‌, పౌరాణిక, మాస్‌ అంశాలను మేళవించిన సినిమాను అప్పటివరకు రాలేదు. ఆ తర్వాత కూడా రాలేదు. ఒకవేళ ఒకరిద్దరు ఆ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తోంది అంటే ఎవరు వద్దంటారు చెప్పండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన సినిమా పవర్‌ను దేశవ్యాప్తం చేసిన సినిమా అది. ఇప్పుడైతే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అవుతుంది.

Aditya 369

‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ అనే సినిమా చేస్తా అని బాలకృష్ణ చాలా ఏళ్ల క్రితమే ప్రకటించారు. తొలుత సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao)ఈ సినిమాను హ్యాండిల్‌ చేస్తారు అని వార్తలొచ్చాయి. అయితే ఆయన కాదు వేరే దర్శకుడు దీని కోసం పని చేస్తారు అని చెప్పారు. ఆఖరికి నేనే సినిమాను హ్యాండిల్‌ చేస్తా అని బాలకృష్ణ ప్రకటించారు. త్వరలో సినిమా ప్రారంభం అని కూడా చెప్పారు. కానీ సినిమా ఇప్పటివరకు మొదలు కాలేదు.

ఈ లోపు ఆ సినిమాతోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) ఇండస్ట్రీలోకి వస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షు తొలి సినిమా అనౌన్స్‌ కావడంతో ఇక ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ ఇప్పట్లో రాదు అని ఫిక్స్‌ అయిపోయారు. అయితే ఇప్పుడు బాలయ్య కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఈ సినిమా సీక్వెల్‌ కథ సిద్ధమైందని తెలిపారు. తాను, సింగీతం శ్రీనివాసరావు కలసి ఒక్క రాత్రిలోనే కథ సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే సినిమాను మొదలు పెడతామని చెప్పారు.

అయితే, ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు అనే వివరాలు ఆయన చెప్పలేదు. చూస్తుంటే బాలయ్యనే డీల్‌ చేస్తాడు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2: తాండవం’ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. అదయ్యాక ఈ ఏడాదిలోనే ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ అనౌన్స్‌ చేస్తారని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus