Balakrishna: మంచు విష్ణు సినిమాలో ఆ పాత్రలో బాలయ్య కనిపించనున్నారా?

స్టార్ హీరో బాలయ్య తన సినీ కెరీర్ లో గెస్ట్ రోల్స్ లో నటించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. బాలయ్య ప్రస్తుతం సినిమాలు, పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి బాలయ్య అఖండ2 సినిమాతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో అఖండ2 సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే మంచు విష్ణు కన్నప్పలో బాలయ్య రావణబ్రహ్మ పాత్రలో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మంచు విష్ణు కానీ బాలయ్య కానీ క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్తలో నిజనిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య కుటుంబానికి, మంచు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. త్వరలో బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నారో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

మంచు విష్ణు అడిగితే బాలయ్య (Balakrishna) ఈ సినిమాకు నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, బాలయ్య, విష్ణు ఒకే సినిమాలో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నప్ప మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలో పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. కన్నప్ప కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా విష్ణు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus