Balakrishna, Nani: ‘గాడ్ ఫాదర్’ బాలయ్య.. అయితే మరి చిరు ఏంటి?

మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసీఫర్’ … ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉంది ఈ చిత్రం. మరి ‘గాడ్ ఫాదర్’ గా బాలయ్య ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. అది తెలుగు ‘గాడ్ ఫాదర్’ కాదు.. ఆ టైటిల్ కూడా బాలయ్య సినిమాకి పెట్టడం లేదు. ఇది పూర్తిగా వేరే తంతు. 1972 వ సంవత్సరంలో వచ్చిన ఓ ఇంగ్లీష్ సినిమా ‘గాడ్ ఫాదర్’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

ఓ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ క్లాసిక్ గా నిలిచింది.ఇక అసలు విషయం ఏంటంటే..’గాడ్ ఫాదర్’ లాంటి చిత్రం కనుక బాలయ్య చేస్తే అందులో తాను కూడా నటించాలని ఉన్నట్టు నాని బాలయ్యని కోరాడు. ‘ఆహా’ కోసం బాలయ్య చేస్తున్న అన్స్టాపబుల్ కు గెస్ట్ గా వచ్చిన నాని తన మనసులో ఉన్న కోరికని బాలయ్యతో పంచుకున్నాడు. బ్రాండో టైపు పాత్రని బాలయ్య చేస్తే, తను అల్-పాచినో పాత్రని చేస్తానని నాని తెలిపాడు.

మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి నాని ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ చేసాడు. తర్వాత సుధీర్ బాబుతో కలిసి ‘వి’ లో కూడా నటించాడు. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో కూడా నటించాడు కానీ అప్పటికి విజయ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus