ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ తరఫున టికెట్ల రేట్లు విషయంలో మాట్లాడేందుకు కొంత మంది సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ మీటింగ్ కు చాలా మంది సినీ ప్రముఖులు రాకపోవడంపై కొంతమంది పెద్దలు అప్సెట్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు ప్రభాస్ అలాగే దర్శకుడు రాజమౌళి కొరటాల శివ ఆర్ నారాయణ మూర్తి ఇంకా పోసాని కృష్ణమురళి అలీ వంటి వారు కూడా వైయస్ జగన్ తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
అయితే బాలకృష్ణ ఎందుకు రాలేదు అనే విషయం లో కూడా అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. రీసెంట్గా బసవతారకం క్యాన్సర్ సంబంధించిన ఒక ఈవెంట్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ఆ విషయంపై స్పందించారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తో జరిగిన మీటింగ్ లో మీరు ఎందుకు పాల్గొన లేదు అని మీడియా ప్రశ్నించగా నందమూరి బాలకృష్ణ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రికి జరిగే మీటింగ్ కు నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను రాను అని చెప్పడం జరిగింది.
ఇప్పుడే కాదు వైయస్ జగన్తో ఎప్పుడు మీటింగ్ జరిగిన కూడా నేను కలవను. అయినా నా సినిమాలకు టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా పరవాలేదు. నా బడ్జెట్ కూడా పరిమితికి మించి ఉండకుండా నేను చూసుకుంటాను. టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నా కూడా అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. నాకు టికెట్ల రేట్ల విషయం అవసరం లేదు అంటూ నందమూరి బాలకృష్ణ నిర్మొహమాటంగా చెప్పేశారు.
ఇక మంచు విష్ణు, ఆలీ కూడా వైఎస్ జగన్ ను కలుసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబుకు కావాలని ఇన్విటేషన్ రాకుండా చేశారని మంచు విష్ణు ఆరోపించారు. వారు ఎవరో తెలుసని త్వరలోనే ఆ విషయంపై కూడా ఆరా తీస్తామని విష్ణు తెలిపారు.