Prabhas, Balayya: ఇంతకీ ప్రభాస్ – బాలయ్య బాబుకి ఏం సర్‌ప్రైజ్ ఇచ్చాడో తెలుసా!

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ‘అన్‌స్టా‌పబుల్ విత్ యన్‌‌బికె’ షోలో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా రాబోతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్‌తో పాటు.. బెస్ట్ ఫ్రెండ్, ‘మ్యాచో హీరో’ గోపిచంద్ కూడా ఆదివారం (డిసెంబర్ 11) న జరిగిన షూటింగులో పాల్గొన్నాడు.. షోలో పార్టిసిపెట్ చేసిన ఫ్యాన్, ఆడియన్స్ ద్వారా కొన్ని ఫోటోలతో పాటు వీడియోలు కూడా బయటకొచ్చాయి.. ఇప్పుడవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. ఈ వీడియోలు చూసి బాలయ్య – ప్రభాస్ అభిమానులే కాదు..

తెలుగు ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు.. బాలయ్య.. ‘నీ షర్టు సైజ్ ట్రిపుల్ ఎక్సెలా?.. ఫోర్ ఎక్సెలా?’.. అని అడగ్గా.. ప్రభాస్ : ‘షర్ట్ సైజ్ మాత్రమే కాదు.. నాకు షూ దొరకడం కూడా కష్టమే.. నా షూ సైజ్ 13’ అని చెప్పాడు.. వెంటనే బాలయ్య : ‘అంత ఉంటే దాన్ని వెంకటేశ్వర స్వామి పాదం’ అంటారంటూ నవ్వించారు.. ‘ఆహా’ టీం అఫీషియల్‌గా ఫోటోలు రిలీజ్ చేసేవరకు వీటిని వైరల్ చేసేశారు అభిమానులు..ఇదిలా ఉంటే.. షోలో బాలయ్య.. ప్రభాస్‌తో చాలా సరదాగా టైం స్పెండ్ చేశారని..

పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషన్‌కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగి ఆస్తికరమైన సమాధానాలు రాబట్టారని సమాచారం.. డార్లింగ్ మాంచి భోజన ప్రియుడనే సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వాళ్లు కూడా డార్లింగ్ ఫుడ్‌కి ఫిదా అయిపోయారు.. బాలయ్య కూడా భోజన ప్రియుడే కానీ ప్రభాస్ అంతమాత్రం కాదు..షోకి వస్తున్న సందర్భంగా.. రెబల్ స్టార్.. బాలయ్య బాబు కోసం ఇంట్లో ప్రత్యేకంగా బిర్యానీ చేయించారట..

పలు నాన్ వెజ్ రకాల కూరలతో పాటు బాలయ్య ఏమేమి ఇష్టంగా తింటాడో తెలుసుకుని.. అవన్నీ చేయించి తెప్పించాడట.. ఇది ‘బాహుబలి’ భోజనం అంటూ బాలయ్య సంతృప్తిగా తిన్నారట.. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్‌, నటసింహం మరియు గోపిచంద్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అందరూ ఈ ఎపిసోడ్ ప్రోమో, స్ట్రీమింగ్ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ టైంలో స్ట్రీమింగ్ అవనుందని అంటున్నారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus