Balakrishna: భగవంత్ కేసరి బ్యూటీకి బాలయ్య మరో అవకాశం ఇచ్చారా?

  • May 8, 2024 / 01:26 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన సినిమా హిట్ గా నిలిస్తే ఆ హీరోయిన్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. గత కొన్నేళ్లలో రాధికా ఆప్టే (Radhika Apte), సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) , నయనతారలకు (Nayanthara) బాలయ్య మళ్లీ మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అయితే భగవంత్ కేసరి బ్యూటీకి బాలయ్య మరో అవకాశం ఇచ్చారని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ (K. S. Ravindra) కాంబో మూవీలో కాజల్ కూడా కనిపిస్తారని భోగట్టా. భగవంత్ కేసరి (Bhagavath Kesari) మూవీ హిట్ గా నిలిచినా కాజల్ పాత్ర నిడివి తక్కువ కావడంతో ఆమె పాత్రకు మరీ పాజిటివ్ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.

కొంతమంది క్రిటిక్స్ కాజల్ (Kajal Aggarwal) పోషించిన పాత్ర గెస్ట్ రోల్ కంటే ఎక్కువని కామెంట్లు చేయడం గమనార్హం. బాలయ్య కాజల్ కాంబినేషన్ రిపీట్ అయితే హిట్ సెంటిమెంట్ వల్ల సినిమాపై క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాబీ కూడా గత సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మూవీ అంచనాలకు మించి ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.

బాలయ్య బాబీ కాంబో మూవీకి వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో తెలియాల్సి ఉంది. సితార నిర్మాతలు నిర్మిస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. సితార నిర్మాతలు ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య బాబీ కాంబో మూవీ కాన్సెప్ట్ కూడా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారని భోగట్టా. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తుండటంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus