Balayya Babu: బిగ్‌బాస్‌కి ‘అన్‌స్టాపబుల్‌’ హోస్ట్‌ నిజమేనా?

బిగ్‌బాస్‌ షో మొదలైనప్పుడు.. నాగార్జున ఈ సారి ఎలా చేస్తారో అనే ప్రశ్న, చర్చ మొదలవుతుంది. షో అయిపోయాక గ్యాప్‌లో వచ్చేసారి నాగార్జున బిగ్‌బాస్‌కి వస్తాడా అనే మాట మొదలవుతుంది. ఇది ఇప్పుడు కాదు ‘బిగ్‌ బాస్‌ 3’ నుండి జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఏవేవో పేర్లు రావడం, ఆఖరికి మళ్లీ నాగార్జున బిగ్‌బాస్‌ అవతారం ఎత్తడం జరుగుతూనే ఉంది. అయితే ఐదు సీజన్లు అయిపోయింది కదా.. ఇక నాగ్‌ ఈసారి రాకపోవచ్చు అని మాట ఎక్కువగా వినిపిస్తోంది ఈసారి.

అంతేకాదు కొత్త బిగ్‌బాస్‌ హోస్ట్‌ అతనే అంటూ ఓ పేరును కూడా ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నరు. గతంలో బిగ్‌ బాస్‌ హోస్ట్‌ మార్పు అనే మాట వచ్చినప్పుడల్లా.. ఎన్టీఆర్‌, రానా అంటూ కొన్ని పేర్లు వచ్చేవి. అయితే ఈ సారి ఆ రెండు పేర్లు కాకుండా మరో పేరు వస్తోంది. అతనే నందమూరి బాలకృష్ణ. అవును ‘అన్‌స్టాపబుల్‌’తో తనలోని హోస్ట్‌ను బయటకు తీసి వావ్‌ అనిపించిన బాలయ్యను ‘బిగ్‌బాస్‌’ టీమ్‌ అప్రోచ్‌ అయ్యింది అని చెబుతున్నారు. దీనికి బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నారని కూడా చెబుతున్నారు.

‘అన్‌స్టాపబుల్‌’ను ఎంతో సరదాగా నడిపిస్తున్నారు బాలయ్య. అలాంటి ఆయన ‘బిగ్‌బాస్‌’ ఇంకా బాగా చేస్తారు అనే విశ్లేషణలు కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్ 6’ అయిపోయిన తర్వాత నాగార్జున త‌ప్పుకోవాల‌ని చూస్తున్న‌ట్టు గత కొద్ది రోజులుగా వార్తలొచ్చాయి. ‘బిగ్ బాస్’ యాజ‌మాన్యానికి ఈ మేరకు నాగార్జున క్లారిటీ కూడా ఇచ్చేశారని టాక్‌. దీంతో బాలయ్యను కాంటాక్ట్‌ అయ్యారని, పారితోషికం మాటలు కూడా అయిపోయాయని అంటున్నారు. అయితే షో చేయ‌డానికి బాలయ్య కొన్ని కండీష‌న్లు పెట్టార‌ని అంటున్నారు.

వాటికి ఓకే అంటనే.. ముందుకు వెళ్లాలి అనేది ఆలోచనట. స్టూడియో వేదిక మార్చడం, టీమ్‌లో కొన్ని మార్పులు లాంటివి బాలయ్య సూచనల్లో ఉన్నాయని చెబుతున్నారు. నాగ్‌ వరుస సీజన్లు బాగానే నడిపించినప్పటికీ.. గత సీజన్‌కు సరైన రేటింగ్స్‌ రాలేదు. మరి ఇప్పుడు అనుకుంటున్నట్లు బాలయ్య హోస్ట్‌ అయితే రేటింగ్‌ మాత్రం పెరుగుతుంది. అయితే దానిని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదనేది ‘అన్‌స్టాపబుల్‌ 2’తో బాలయ్యకు ఇప్పటికే అర్థమైంది. సో ఎంత జాగ్రత్తగా ముందుకెళ్తారో చూడాలి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus