నందమూరి బాలకృష్ణ స్పీడ్ గా సినిమాలు చేయడానికి ముందుంటారు. ఇన్నేళ్ళలో ఆయన భారీగా పారితోషికం పెంచింది లేదు. ‘అఖండ’ కి ముందు వరకు ఆయన పారితోషికం రూ.4 నుండి రూ.6 కోట్ల మధ్యలోనే ఉండేది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘వీరసింహారెడ్డి’కి రూ.10 నుండి రూ.12 కోట్ల వరకు అందుకున్నట్టు ఇన్సైడ్ టాక్.ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకి నాన్- థియేట్రికల్ రైట్స్ లో కూడా షేర్ అందుకుంటున్నారు అని వినికిడి.
అన్నీ ఎలా ఉన్నా.. నిర్మాతకు ఫాస్ట్ గా సినిమా చేసి పెడితే.. అది వాళ్ళకి పెద్ద లాభం తెచ్చిపెట్టినట్టే..! స్పీడ్ గా సినిమాలు చేయడం కూడా బాలకృష్ణకి బాగా ఇంట్రెస్ట్. గ్యాప్ తీసుకుంటే అలిసిపోతాం అనుకునే మనస్తత్వం కూడా..! అలాంటి బాలయ్య ఇటీవల షూటింగ్ అప్డేట్ కోసం అడిగిన నిర్మాతలపై ఫైర్ అయ్యారట. అంతేకాదు ఓ రేంజ్ లో క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తుంది.అందుకు కారణం కూడా అందరూ ఈజీగానే గెస్ చేయవచ్చు.
ప్రస్తుతం తారకరత్న హాస్పిటల్ లో పడున్నాడు. ఇటీవల అతను గుండెపోటుకు గురవ్వడం.. దాని నుండి ఇంకా కోలుకోకపోవడం.. బాలయ్యని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎక్కువగా బాలయ్య.. తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు వెళ్తూ ఉంటున్నాడు. మరోపక్క అతను అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి.
షూటింగ్ లేట్ అయితే నిర్మాతకి భారీగా నష్టం వస్తుంది కాబట్టి.. బాలయ్యకి ఆ నిర్మాత ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఫైనల్ గా ఇలాంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయొద్దని బాలయ్య కాస్త కఠినంగానే చెప్పినట్టు వినికిడి. తారకరత్న కోసం బాలయ్య మృత్యుంజయ హోమాలు కూడా చేయిస్తున్నారు.