Bhagavanth Kesari: భగంత్ కేసిరి సక్సెస్ చూసి బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరో

ఈ దసరా కానుకగా విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరెక్టర్ తో బాలయ్య చేసిన సినిమా కాబట్టి ఈ చిత్రం పై అభిమానుల్లో మరియు ట్రేడ్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉండేవి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే మొదటి ఆట నుండి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన తమిళ డబ్బింగ్ చిత్రం ‘లియో’ మేనియా లో యూత్ మొత్తం ఉండడం వల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ కాస్త దెబ్బ తిన్నాయి. కానీ ఆ తర్వాత నుండి మాత్రం ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా విడుదలైన అన్నీ సినిమాల మీద ఆధిపత్యం చూపించింది.

అలా 67 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఛేదించే లక్ష్యం తో దిగిన ఈ సినిమా, మొదటి వారం లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని తొలుత బాలయ్య బాబు తో కాకుండా, విక్టరీ వెంకటేష్ తో చేద్దాం అని అనిల్ రావిపూడి అన్నాడట.

ఎఫ్ 2 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ఈ మూవీ స్టోరీ చర్చకి వచ్చిందట. అయితే కథ మొత్తం విన్న వెంకటేష్ చాలా బాగుంది కానీ ఈ సినిమా నాకంటే బాలయ్య బాబు కి బాగా సూట్ అవుతుంది అని అన్నాడట. ఆయన చెప్పినట్టు గానే బాలయ్య బాబు ని కలిసి ఈ స్టోరీ వివరించాడట, అలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెంకటేష్ చెయ్యి జారీ బాలయ్య కి చేరింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus