Unstoppable Promo: వైరల్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ ప్రోమో.. అదొక్కటే మైనస్ అంటున్న నెటిజన్లు..!

బాలయ్య ఓ టాక్ షో చేస్తున్నాడు అనే వార్తలు మొదలవ్వగానే చాలా మంది దీనిని ఖంచించారు. ఎందుకంటే పలు సినిమాల వేడుకల్లో బాలకృష్ణ ఇచ్చిన స్పీచుల పై నిరంతరం ట్రోలింగ్ జరగడం వలన. నిజానికి ఆయన ఎక్కడో మొదలుపెడతాడు… ఇంకెక్కడో ఎండ్ చేస్తాడు అని అందరూ అంటుంటారు. అలాంటి బాలయ్య షో చేస్తున్నాడు అంటే విడ్డూరమీ కదా..! అయితే నిజంగానే ఆయన ఆహా వారి కోసం ‘అన్ స్టాపబుల్’ అనే షో చేయడానికి రెడీ అవ్వడంతో అంతా షాక్ తిన్నారు.

ఈ షో వల్ల మీమ్స్ చేసేవాళ్ళకి బోలెడంత స్టఫ్ దొరుకుతుందని కామెంట్లు పెట్టిన వారెందరో…! అయితే తాజాగా ‘అన్ స్టాపబుల్’ మొదటి ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది.హోస్ట్ గా బాలయ్య లుక్ కూడా బాగుంది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, మంచు విష్ణు, లక్ష్మీ మంచు వంటి వారు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన అలాగే చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా బాలయ్య- మోహన్ బాబు ల సంభాషణ మధ్య వచ్చింది.దాంతో మొదటి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

ఈసారి బాలయ్య గురించి ట్రోలింగ్ ఏమీ జరగలేదు. మోహన్ బాబు ఎపిసోడ్ తర్వాత నానిని ఇంటర్వ్యూ చేయబోతున్నాడట బాలయ్య. కాకపోతే ఒకటే మైనస్ అంటున్నారు నెటిజన్లు. అదేంటంటే బాలయ్య వాయిస్ చాలా డల్ గా ఉందట. ‘పైసా వసూల్’ సినిమా ప్రమోషన్స్ టైం నుండీ బాలయ్య వాయిస్ చాలా వరకు ఇలాగే మారిపోయింది. ఆయన గొంతు సమస్య సెట్ అయితే ఈ షో సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంతా అభిప్రాయపడుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus