Balarkishna, Jr NTR: బాబాయ్ అబ్బాయ్ విషయంలో ఈ పోలికను గమనించారా?

స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడంతో పాటు నందమూరి ఫ్యామిలీ పరువు నిలబెడుతున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో తారక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. స్టేజ్ పై బాలయ్య గత సినిమాల వీడియోలు ప్రసారమవుతున్న సమయంలో కుర్చీలో కూర్చుని బాలయ్య డైలాగ్స్ చెబుతూ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కనిపించారు. గతంలో పలు ఈవెంట్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విధంగా చేశారు. ఈ విషయంలో నందమూరి హీరోలు సేమ్ టు సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాలయ్య ఖాతాలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వీరసింహారెడ్డి సినిమాలో బోయపాటి మార్క్ డైలాగ్స్ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎక్కువ రన్ టైమ్ తో ఈ సినిమా రిలీజ్ కానుండగా అతి త్వరలో ఈ సినిమా సెన్సార్ పూర్తి కానుంది. వీరసింహారెడ్డి సినిమా థియేటర్ల సంఖ్యకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. వీరసింహారెడ్డి మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus