Balakrishna, Mahesh Babu: మహేష్‌ పెళ్లి గురించి బాలయ్య ఏమన్నాడంటే?

బాలకృష్ణ ఫ్యాన్స్, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రోమో వచ్చేసింది. ‘ఆహా’లో స్ట్రీమ్‌ అవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ తాజా, తొలి సీజన్‌ ఆఖరి ప్రోమో రిలీజ్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల నుండి కొన్ని కీలకమైన, ఆసక్తికరమైన అంశాలను ప్రోమోలో పొందుపరిచారు. నాలుగో తేదీ టెలీకాస్ట్‌ కానున్న ఈ ఎపిసోడ్‌లో ప్రోమోలో బాలయ్య… మహేష్‌బాబు నుండి కీలక విషయాల రాబట్టినట్లు అర్థమవుతోంది. అందం గురించి, పెళ్లి గురించి, ఫెయిల్యూర్‌ టైమ్‌ గురించి ఇలా చాలా విషయాలు ఎపిసోడ్‌లో ఉన్నాయంటున్నారు.

మహేష్‌బాబు ఇప్పటికీ యంగ్‌గా ఉండటం గురించి మాట్లాడటంతోనే ప్రోమో మొదలైంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎపిసోడ్‌ ఎలా సాగింది. ‘ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ’ అంటూ మహేష్‌ను బాలయ్య పొడగటం అదిరిపోయిందంటే. ప్రతి ఎపిసోడ్‌లో తన డైలాగ్‌ను గెస్ట్‌ చెప్పించి, స్టెప్‌ వేయించి మురిసిపోవడం బాలయ్యకు బాగా ఇష్టం. ఈ ఎపిసోడ్‌లో కూడా అలాంటి ట్రై చేశాడు కానీ వర్కౌట్‌ కాలేదు. ‘మీ డైలాగ్‌ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు’ అంటూ బాలయ్యను ఖుష్‌ చేశాడు మహేష్‌.

దానికి బాలయ్య నవ్వు అయితే మిలియన్‌ డాలర్‌ మూమెంట్‌ ఫ్యాన్స్‌కి. చిన్నతనంలో మహేష్‌ నాటీ కిడ్‌ అని… చేసేవన్నీ చేసేయడం, చెప్పడానికి మాత్రం సిగ్గుపడటం అంటూ మహేష్‌ను టీజ్‌ చేసే ప్రయత్నం చేశారు బాలయ్య. దానికి మహేష్‌ చిరునవ్వుతోనే సమాధానమిచ్చి వదిలేసినట్లున్నాడు. ఇంకేమన్నా చెప్పాడా అనేది రేపు తెలుస్తుంది. నంబర్‌ 1 స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో మూడేళ్ల గ్యాప్‌ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటూ మహేష్‌ని అడిగారు బాలయ్య. ‘‘నన్ను నేను కరెక్ట్‌ చేసుకోవడానికి ఆ గ్యాప్‌ తీసుకున్నా’’ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు మహేష్‌.

వరుస ఫ్లాప్‌లు రావడంతో ‘అతిథి’, ‘ఖలేజా’ మధ్యలో మూడేళ్లు గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాడు మహేష్‌. ఈ సందర్భంగా మహేష్‌ బాబు – నమ్రతల పెళ్లి గురించి కూడా ప్రస్తావించాడు బాలయ్య. అకేషన్‌ అని చెప్పి వెళ్లి, పెళ్లి చేసుకొని వచ్చేశావు ఏంటి సంగతి అని అడిగాడు బాలయ్య. మరి ఈ మాటకు మహేష్‌ ఏం చెప్పాడో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus