బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్ షురూ చేస్తారట

గత ఎడాది ఎదురైన వరుస పరాజయాలకు సమాధానం గా గట్టి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తో నందమూరి నటసింహం బాలయ్య తనకు అచ్చి వచ్చిన దర్శకుడు బోయపాటితో సినిమాకు సిద్ధం అయ్యారు.గత ఏడాది రూలర్ విడుదలకి ముందే ఈ సినిమా ప్రకటించడం జరిగింది.ఐతే రూలర్ సినిమా వసూళ్ల తరువాత చాలా సమీకరణాలు మారిపోయాయి.బాలయ్య మార్కెట్ ఏ స్థాయిలో పతనం అయ్యిందో రూలర్ వసూళ్లు తేల్చి వేశాయి. ఇక బాలయ్య-బోయపాటి సినిమా నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించడం అంత సేప్ కాదని డిసైడ్ అయ్యారు.దీనితో ఎప్పుడో జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ లేట్ అయ్యింది.

ఐతే దర్శకనిర్మాతలకు మధ్య ఒప్పందం కుదరడంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారట. వచ్చే నెల 10నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.చకచకా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి వేసవి చివర్లో లేదా దసరా కానుకగా విడుదల చేయాలనీ చూస్తున్నారట. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.దీనితో బాలయ్య మరోసారి ఈ చిత్రంతో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus