తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పమంటే అందరూ అక్కినేని నాగేశ్వరరావు(ANR), నందమూరి తారక రామారావు (Sr NTR) ..ల నుండే మొదలు పెడతారు. సినిమాల పరంగా ఇద్దరి మధ్య మొదట్లో పోటీ ఉండేది. తర్వాత ఎవరి శైలికి తగ్గట్టు వాళ్ళు సినిమాలు చేసేవారు. వీరిద్దరినీ తెలుగు సినీ పరిశ్రమకి రెండు కళ్ళు అని చెబుతుంటారు. కానీ వీళ్ళ వారసులు అయినటువంటి నందమూరి బాలకృష్ణ (Balakrishna) , అక్కినేని నాగార్జున (Nagarjuna) ..ల మధ్య మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది.
గతంలో చూసుకుంటే బాలయ్య (Balayya Babu) స్పీచ్.. ఇస్తున్న టైంలో నాగార్జున వెటకారంగా నవ్విన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత ‘జోష్’ (Josh) సినిమా ఆడియో రిలీజ్ కి బాలయ్య వచ్చి మరీ నాగచైతన్యకి (Naga Chaitanya) బెస్ట్ విషెస్ చెప్పాడు. మళ్ళీ ఓ అవార్డుల వేడుకలో ‘నాకు బాలయ్యకి పడదు అంటూ కొంతమంది అనుకుంటున్నారు. అది వట్టి అపోహ మాత్రమే’ అని నాగార్జున సభాముఖంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏఎన్నార్ కాలం చేసిన టైంలో బాలయ్య..
నాగార్జునని పరామర్శించిన సందర్భాలు లేవు. ఇక ఇటీవల నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో బాలయ్య కనిపించింది లేదు. సో వీళ్ళకి పడదు అని చాలా మంది ఫిక్సయి పోయారు. ఇలాంటి టైంలో ‘నాగార్జునని బాలయ్య లెజెండ్ అనడం’ హాట్ టాపిక్ అయ్యింది. ఐఫా అవార్డుల వేడుకలో భాగంగా బాలయ్య లెగసీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శక-నిర్మాత అయినటువంటి కరణ్ జోహార్..
బాలయ్యతో ముచ్చటించాడు. మీ తోటి స్టార్లు అయినటువంటి.. ‘చిరంజీవి, నాగార్జున, వెంకటేష్..లలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?’ అంటూ కరణ్.. బాలయ్యని ప్రశ్నించడం జరిగింది. దీనికి బాలయ్య ‘తనకు సమకాలీకులైన నాగ్, చిరు (Chiranjeevi), వెంకీ (Venkatesh) .. ఈ ముగ్గురూ కూడా లెజెండ్స్’ అంటూ సమాధానం ఇచ్చాడు బాలయ్య. నాగ్ ని కూడా లెజెండ్స్ లిస్ట్ లో బాలయ్య పెట్టడం అనేది విశేషంగానే చెప్పుకోవాలి.