Aha Naa Pellanta: ట్రైలర్‌లో రాజ్ తరుణ్ చెప్పిన బాలయ్య డైలాగ్ వీడియో వైరల్..!

ఈ రోజుల్లో సినిమాల విషయంలో సోషల్ మీడియా అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో చెప్పక్కర్లేదు.. చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టేవరకు జరిగే తతంగం.. టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇలాంటి అప్ డేట్స్ అన్నీ చక్కర్లు కొడుతుంటాయి.. ఫన్నీ మీమ్స్, వీడియోస్ సంగతి తెలిసిందే.. ఏదైనా ఒక డైలాగ్, సాంగ్ నచ్చిందంటే ఇక సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.. పైగా తమ ఫేవరెట్ స్టార్ గురించి టాపిక్ వచ్చిందంటే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు..

ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘అహ నా పెళ్లంట’ కి నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు బాగా సపోర్ట్ చేస్తున్నారు.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ..ఎరుగని గోలంట!).. జీ5, తమాడా మీడియా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 4) రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది..

ఆకట్టుకునే కంటెంట్, అలరించే క్యారెక్టర్లతో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కలిగించింది.. ట్రైలర్ చివర్లో రాజ్ తరుణ్ తన ఫ్రెండ్స్‌తో సీరియస్‌గా డిస్కస్ చేస్తుంటే.. వెనుక టేబుల్ దగ్గర కూర్చున్న కుర్రాడు ‘జై బాలయ్య’ అని అరుస్తాడు.. వెంటనే మన హీరో కూడా ‘జై బాలయ్య’ అంటే.. ఫ్రెండ్స్ కూడా కోరస్ ఇస్తారు. ఈ ఎండ్ పంచ్ అయితే అదిరిపోయింది అసలు.. ఇంకేముంది, బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు..

‘అహ నా పెళ్లంట’ ట్రైలర్‌ని, రాజ్ తరుణ్ ‘జై బాలయ్య’ డైలాగ్‌ని తెగ వైరల్ చేసేస్తున్నారు.. అనకాపల్లి టు అమెరికా.. క్రికెట్ స్టేడియం అయినా పబ్ అయినా.. ప్లేస్ ఏదైనా సరే బాలయ్య బేస్ ఉండాల్సిందేనంటారు ఫ్యాన్స్.. అలా రాజ్ తరుణ్ తమ ఫేవరెట్ హీరో పేరు పలకడంతో సోషల్ మీడియాలో ఈ సిరీస్‌కి మంచి బూస్టప్ ఇస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.. మొత్తం 8 ఎపిసోడ్స్ సిరీస్‌గా రూపొందుతున్న ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!) నవంబర్ 17 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus