Balakrishna Next Movie Title: బాలయ్య మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

స్టార్ హీరో బాలకృష్ణ అఖండ మూవీ సక్సెస్ తో జోరుమీదున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 65 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఈ సినిమాకు ఇప్పటికే వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ ఫిక్స్ అయింది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్నారని వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా మరో పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గా బాలయ్య కనిపించనున్నారని బోగట్టా. అయితే ఈ వార్తలకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటిగా మైత్రీ మూవీ మేకర్స్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకోగా ఈ బ్యానర్ లో బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. వేటపాలెం టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖండతో వచ్చిన క్రేజ్ ను కొనసాగిస్తూ బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో కూడా నటిస్తారని తెలుస్తోంది.

సినిమాల విషయంలో బాలయ్య వేగం పెంచడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అఖండ సక్సెస్ తో బాలయ్య సినిమాలకు మార్కెట్ పెరిగింది. బాలయ్య సైతం పాన్ ఇండియా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాలయ్య సత్తా చాటుతున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచిందని చెప్పవచ్చు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus