Balakrishna,Prabhas: ‘అన్ స్టాపబుల్’ లో ప్రభాస్.. ఆ చేదు జ్ఞాపకాలను మరిపించేలా..!

ఈ ఏడాది ప్రభాస్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ‘రాధే శ్యామ్’ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. ‘పౌర్ణమి’ తర్వాత ప్రభాస్ కు డిజాస్టర్ అంటే ఏంటో చూపించింది ఈ మూవీ. ఇక సెప్టెంబర్ లో ప్రభాస్ పెదనాన్న అయినటువంటి కృష్ణంరాజు గారు మరణించారు. సౌత్ లో మొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగాడు. కానీ అతని సినిమాలకంటే నిన్న, మొన్న వచ్చిన అల్లు అర్జున్, నిఖిల్, రిషబ్ శెట్టి వంటి హీరోల సినిమాలు రికార్డులు తిరగరాస్తున్నాయి.

మరోపక్క ప్రభాస్ లుక్స్ గురించి కూడా బోలెడంత ట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభాస్ కు బాలయ్య వల్ల బాగా హెల్ప్ అయ్యిందట. దేని గురించి చెప్పబోతున్నానో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ప్రభాస్ తో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు.కానీ ప్రభాస్ నే ఎక్కువ హైలెట్ చేస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం.

‘బాహుబలి’ (సిరీస్) తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాలు ‘సాహో’ ‘రాధే శ్యామ్’ వంటివి అభిమానులను నిరాశపరిచాయి.’సాహో’ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. అది కూడా కమర్షియల్ లెక్కల ప్రకారమే. ‘రాధే శ్యామ్’ కు ఆ ముచ్చట కూడా లేదు. ఈ సినిమాల అప్డేట్ ల కోసం రిలీజ్ డేట్ ల కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూసి అలసిపోయారో కూడా అందరికీ తెలిసిందే.అయితే ‘అన్‌స్టాపబుల్ 2’ కు ప్రభాస్ రావడం.

. ప్రభాస్ అభిమానుల్లో బోలెడంత మైలేజ్ నింపింది. ప్రభాస్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అన్ స్టాపబుల్ కు వచ్చే హీరోల్లో జోష్ నింపడం బాలయ్య నైజం. ఈసారి ప్రభాస్ వంటి హీరోలోనే కాకుండా అతని అభిమానుల్లో కూడా బాలయ్య జోష్ నింపుతాడు అని అంతా భావిస్తున్నారు. ఈ రకంగా రెండు పాన్ ఇండియా సినిమాల కంటే కూడా బాలయ్య హోస్ట్ చేసే షో వల్ల ప్రభాస్ అభిమానులు సంతృప్తి పొందనున్నట్టు స్పష్టమవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus