తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ మార్కెట్ ఉండడంతో.. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు 10, 15, 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకొంటున్నారు కానీ.. అగ్ర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు తీసే నిర్మాతలు లేరు. చిరంజీవి లక్కీగా రీఎంట్రీ తర్వాత కొడుకు నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నాడు కాబట్టి.. ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే.. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలకు మాత్రం ఆరేడు కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు.
అయితే.. బాలయ్య మాత్రం సడన్ గా తన రెమ్యూనరేషన్ పెంచేశాడట. మొన్నటివరకూ బాలయ్య రెమ్యూనరేషన్ 5 కోట్ల రూపాయలు. ఉన్నట్లుండి 10 కోట్ల రూపాయలు అడుగుతున్నాడట. దాంతో ఇబ్బందుల్లో పడుతున్నారు నిర్మాతలు. మంచి స్టార్ డమ్ ఉంది కాబట్టి.. సక్సెస్ లు ఉంటే ఎంత మొత్తం రెమ్యూనరేషన్ గా ఆశించినా పర్లేదు కానీ.. “ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” దారుణంగా పరాజయం పాలైన తర్వాత బాలయ్య ఇలా రెమ్యూనరేషన్ పెంచడం సరికాదని నిర్మాతలు భావిస్తున్నారు. మరి దర్శకుల కథానాయకుడు అని చెప్పుకొనే బాలయ్య.. నిర్మాతల గురించి కూడా ఆలోచిస్తే బాగుండు.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!