Balayya Babu, ANR : అన్‌స్టాపబుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఇచ్చిన బాలకృష్ణ!

అన్‌స్టాపబుల్‌ అంటూ బాలకృష్ణ గత కొన్ని రోజులుగా ‘ఆహా’ వేదికగా నాన్‌స్టాప్‌ సందడి చేస్తున్నారు. మధ్యలో చిన్న గ్యాప్‌ ఇచ్చినా, మళ్లీ సెలబ్రేషన్‌ మూడ్‌లో మూడో ఎపిసోడ్‌ చేసేశారు. ఇప్పుడు అది స్ట్రీమ్‌ అవుతోంది కూడా. ప్రముఖ నటుడు బ్రహ్మానందం, యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ ఎపిసోడ్‌కి గెస్ట్‌లు. గత రెండు ఎపిసోడ్‌లలో బాలయ్య సందడి 1000 వాలా అయితే, ఈ సారి 10,000 అని చెప్పొచ్చు. బ్రహ్మానందంతో కలసి చిన్నపిల్లాడిలా అల్లరి చేశాడు బాలయ్య.

ఈ క్రమంలో బ్రహ్మానందం ఎన్టీఆర్‌లా మారి, డైలాగ్‌ చెప్పి మెస్మరైజ్‌ చేశారు. ఆ తర్వాత ‘ఏది ఏఎన్నార్‌లా మీరు డైలాగ్‌ చెప్పండి చూద్దాం’ అని బాలయ్యకు సవాలు విసిరారు బ్రహ్మానందం. ఇలా ఛాలెంజ్‌లు బాలయ్యకు చాలా చిన్న విషయం. ఠక్కున ఏఎన్నార్‌ డైలాగ్‌ అందుకుని, నటించి, చెప్పి వావ్‌ అనిపించారు బాలయ్య. ‘మాతామ్ముర… నీవు నటించగలవా..’ అంటూ అలనాటి ఏఎన్నార్‌ డైలాగ్‌ను చెప్పారు బాలయ్య. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్కడా ఇక్కడా ఎందుకులే అనేమో… ఆహా టీమ్‌ కూడా యూట్యూబ్‌లో ఆ వీడియోను అధికారికంగా రిలీజ్‌ చేసింది. నాగేశ్వరరావు గొంతును బాలయ్య భలేగా అనుకరించారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓసారి మీరూ ఆ వీడియో చూసేయండి, డైలాగ్‌ చెప్పే తీరు, ఆ తర్వాత ఆయన చేసిన సందడి మామూలుగా ఉండదు. అసలే ‘అఖండ’ విజయంతో ఉన్నాడు మరి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus