Balakrishna: బాలయ్యతో ‘బింబిసార’ డైరక్టర్‌.. అన్నీ ఓకేనట!

ఎప్పుడో హీరోగా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత చాన్నాళ్లపాటు దర్శకుడిగా మరడానికి విశ్వప్రయత్నాలు చేశారు మల్లిడి వశిష్ట్‌. ఆయన చిరకాల ప్రయత్నం ఎట్టకేలకు ‘బింబిసార’తో నెరవేరింది. సినిమాకు అనూహ్య స్పందన వచ్చింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. అయితే తన తర్వాతి సినిమా విషయంలో వశిష్ట్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ‘బింబిసార 2’ వస్తుంది అని మాత్రం చెప్పారు. ఆ సినిమా పనులు కూడా స్టార్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత ఏంటి అనేదే ప్రశ్న.

‘బింబిసార’ సినిమా విడుదలైన తర్వాత వశిష్ట్‌ చాలామంది అగ్ర హీరోలను కలిశాడు. తన తండ్రితో సినీ వర్గాలకు దగ్గర సంబంధం ఉండటంతో.. అలా కలిశారు అని అంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది హీరోలకు కథలు చెప్పారనే మాటలు కూడా వినిపించాయి. అందులో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి అప్పుడు మాటలు రావడం కానీ.. ఆ తర్వాత ఎలాంటి ముచ్చట్లూ లేవు. అయితే తాజాగా మళ్లీ ఆ సినిమా చర్చల్లోకి వచ్చింది.

దీనికి కారణం బాలకృష్ణ నెక్స్ట్‌ మూవీ వశిష్ట్‌తోనే అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమాను అనిల్‌ రావిపూడితో చేస్తున్నారు. ఆ తర్వాత 109వ సినిమాగా మల్లిడి వశిష్ట్‌ సినిమా ఉండొచ్చు. దీనికి నిర్మాతగా ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ నుండి కొన్నాళ్ల క్రితం విడిపోయిన సీవీఎం మోహన్‌ ఉంటారు అని అంటున్నారు. ఆయనకు, బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే సినిమా చేస్తున్నారని టాక్‌. ఇటీవల సీవీఎం మోహన్‌ నానితో సినిమాను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. రాజకీయ కోణంలో సినిమా ఉంటుందని, ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుంది అని కూడా అన్నారు. దీంతో మల్లిడి వశిష్ట్‌, బోయపాటి సినిమాల్లో ఏది ముందు అనేది తెలియాల్సి ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus