Balayya Babu: ‘వెన్నుపోటు’పై బాలకృష్ణ ఈసారి ఫుల్‌ క్లారిటీ ఇస్తారా!

ఇండస్ట్రీలో సెలబ్రిటీల మనసులో మాటల్ని, వాళ్ల గురించి తెలియని విషయాలు ప్రేక్షకులు చెప్పేలా బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల విషయాలు ఏమో కానీ, బాలకృష్ణ గురించి మాత్రం ప్రేక్షకులకు ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని చెప్పొచ్చు. మూడు ఎపిసోడ్లు స్ట్రీమ్‌ అయిన ఈ షోలో గెస్ట్‌లు వచ్చి కొన్ని ప్రశ్నలు బాలయ్యను అడుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పే సమాధానాలు చాలా మంది అనుమానాలను నివృత్తి చేస్తున్నాయి.

‘అన్‌స్టాపబుల్‌’ షోకి ఈ సారి ‘అఖండ’ టీమ్‌ వచ్చింది. బోయపాటి శ్రీను, శ్రీకాంత్‌, తమన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ సందడి చేశారు. ఈ క్రమంలో మంచి ఫన్‌ వచ్చింది అంటున్నారు. దీంతోపాటు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చలో ఉన్న కొన్ని అంశాలు, తన గురించి బయట సర్క్యులేట్‌ అవుతున్న మరికొన్ని విషయాల గురించి బాలకృష్ణ స్పందించారని సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆ తర్వాత జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి షోలో చర్చ నడిచిందట.

ఈ క్రమంలో బాలకృష్ణ ‘వెన్నుపోటు’ అనే అంశం గురించి తన మనసులోని భావాలను వెల్లడించారట. ఇటీవల విడుదలైన ప్రోమోలో దీని గురించి బాలయ్య మాట్లాడుతూ… ‘‘అందరూ వెన్నుపోటు అంటుంటారని, తప్పుడు ప్రచారం చేస్తుంటారని కానీ అబద్ధమని’’ అన్నాడు. బాలయ్య దేని గురించి ఈ మాట అన్నాడనేది క్లారిటీ లేకపోయినా… ఈ షో తొలి ఎపిసోడ్‌లో మోహన్‌బాబు రెయిజ్‌ చేసిన ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడిని చేసిన సందర్భం గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కూడా ఇదే మాట ప్రస్తావిస్తున్నారు. దీనిపై స్పందిస్తూనే బాలయ్య అలా అన్నారని అంటున్నారు. అయితే మోహన్‌బాబు అడిగినప్పుడు సరిగ్గా స్పందించని బాలయ్య… ఇప్పుడు ఎందుకు చెప్పినట్లో.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus