నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ‘అన్ స్టాపబుల్’ అనే విధంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ హీరో ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని టీజర్ తోనే అందరికీ క్లారిటీ వచ్చేసింది.ఈ చిత్రంలో బాలయ్యకి జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో లేదా 2023 సంక్రాంతి బరిలో విడుదల కానుంది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించబోతున్నాడు. అంతేకాదు ఓ కూతురిగా తండ్రిలా కూడా కనిపించబోతున్నాడట బాలయ్య. ఇదిలా ఉండగా.. ‘అఖండ’ సినిమాకి ముందు వరకు పారితోషికం విషయంలో ఏ నిర్మాతతో కూడా నాకు ఇంత కావాలి అని బాలయ్య డిమాండ్ చేసింది లేదు. తన తండ్రి బాటలోనే ఆయన కూడా నిర్మాతలకు అందుబాటులో ఉండాలి అని ఆయన భావించే వారు.
డబ్బు కోసం కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించేవారు కాదు. ‘అఖండ’ కి ఆయన తీసుకున్న పారితోషికం కూడా రూ.10 కోట్లే..! బాలయ్య సినిమా హిట్ అయితే భారీ లాభాలు రావడం గ్యారెంటీ. అలాంటప్పుడు అతను పారితోషికం డిమాండ్ చేసినా తప్పులేదు. గోపీచంద్ మలినేని మూవీ కోసం బాలయ్య నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటాతో కలుపుకుని రూ.18 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నారు అని వినికిడి.
ఆ సినిమాకి రూ.80 కోట్ల వరకు బిజినెస్ అవుతుందట. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న సినిమా కోసం కూడా భారీగా పారితోషికం అందుకోబోతున్నాడట. ఇది బాలయ్య 108 వ సినిమా కాగా.. ఈ సినిమా కోసం ఆయన అక్షరాలా రూ.25 కోట్లు పారితోషికం అందుకోబోతున్నట్టు తెలుస్తుంది. సీనియర్ స్టార్ హీరోల్లో ఒక్క చిరంజీవి మాత్రమే రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!