ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిన సంగతి వాస్తవమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. వారాంతంలో వచ్చే వెబ్ సిరీస్ లు, సినిమాలు, టాక్ షోలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు అన్నది కూడా పచ్చి నిజం. ఈ నేపథ్యంలో ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అయ్యే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో.. ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ ల కంటే కూడా ఎక్కువ వ్యూయర్ షిప్ ను నమోదు చేయడమే కాకుండా ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా…
నెంబర్ 1 రేటింగ్ ను దక్కించుకుని దుమ్ము లేపింది. దీంతో సోనీ లివ్ వారు కూడా ఓ టాక్ షోని ప్రారంభించారు. స్మిత హోస్ట్ గా చేస్తున్న ఈ టాక్ షో ‘నిజం విత్ స్మిత’ పేరుతో స్ట్రీమింగ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, రాధిక వంటి వారు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. కానీ ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రేంజ్ లో అయితే ఇది సక్సెస్ కాలేదు. ఈ షోలో స్మిత అడిగే ప్రశ్నలు ఆసక్తికరంగానే ఉన్నాయి.
మంచి మంచి టాపిక్స్ పైనే ఆమె సెలబ్రిటీలను ప్రశ్నలు అడుగుతుంది. అయినా సరే ఈ టాక్ షో సక్సెస్ కాలేదు. అసలు ఇలాంటి టాక్ షో ఉందని కూడా జనాల మైండ్ లో రిజిస్టర్ కావడం లేదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ‘సోనీ లివ్’ అనే ఓటీటీకి ఇంకా జనాదరణ దక్కలేదు. అసలు ఇందులో స్ట్రీమింగ్ అయ్యే కొత్త సినిమాలు కూడా జనాలకు తెలీదు. కానీ ‘ఆహా’ అలా కాదు. లాక్ డౌన్ టైం ‘ఆహా’ కి బాగా కలిసొచ్చింది. జనాలకు బాగా దగ్గరైంది.
‘కలర్ ఫోటో’ వంటి సినిమాలను నేరుగా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్లను అందుకుంది.దానికి తోడు బాలయ్య క్రేజ్ ఇంకా అడ్వాంటేజ్ అయ్యింది. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ముందు స్మిత టాక్ షో తేలిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవే..! ‘స్మిత టాక్ షో’ అనే కాదు సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ టాక్ షో కూడా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్