Balakrishna: కర్నూలులో షూటింగ్‌ ఓ పక్క.. అభిమానం మరో పక్క!

బాలయ్య భోళా మనిషి, బాలయ్య మనసు బంగారం, బాలయ్యకు అభిమానులంటే ప్రాణం… ఇదేంటి బాలయ్య గురించి ఇలా పొగిడేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఆయన ఏం చేస్తే అది చెప్పడం మంచిదే కదా. తనతో ఎలా ఉంటే తను అలా ఉండటం బాలయ్యకు అలవాటు. ఇప్పటివరకు బాలయ్య అలా ఉంటూనే వచ్చాడు. తాజాగా బాలయ్య కర్నూలులో కూడా ఇదే పని చేశాడు. ఇప్పుడు ఆ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గోపీచంద్‌ మలినేని సినిమా కోసం బాలయ్య ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. సీమ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ప్రజల మధ్యలోనే చిత్రీకరించాలని చిత్రబృందం నిర్ణయించింది. దీంతో కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్‌ జంక్షన్‌ వద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతోపాటు ఆయన ఓ అభిమాని ఇంటికెళ్లి భోజనం చేస్తున్న వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఓ హిందీ అభిమాని ఇంట్లో కూర్చుని అతని కుటుంబంతో కలసి బాలయ్య భోజనం చేస్తున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. ఆహార పదార్థాల గురించి, పరిస్థితుల గురించి బాలయ్య వారితో మాట్లాడుతుండటం వీడియోలో చూడొచ్చు. అలాగే ఓ చిన్న పిల్లాడితో తన గదిలో బాలయ్య ఆడుకోవడం మరో వీడియోలో చూడొచ్చు. ఇక అభిమాని ఇంటికి బాలయ్య వెళ్లడం గురించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. గతంలో ఓసారి మిమ్మల్ని కలవాలని ఉందని బాలయ్యను అతను అడగడంతో.. ఈసారి బాలయ్యే ఫోన్‌ చేసి మరీ పిలిపించారని టాక్‌.

అలాగే కథానాయిక శ్రుతి హాసన్‌, దర్శకుడు గోపీచంద్‌ మలినేనితోపాటు ఇతర క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లతో బాలయ్య దిగిన సెల్ఫీలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అందులో శ్రుతి హాసన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అదిరిపోయాయి అని చెప్పాలి. కావాలంటే మీరే ఈ వీడియోలు, ఫొటోలు చూడండి మీకే అర్థమవుతుంది. బాలయ్యకు కోపమొచ్చినప్పుడు తట్టుకోవడం ఎంత కష్టమో, ప్రేమ కలిగినప్పుడు దానిని ఫీల్‌ అవ్వడం అంత ఆనందం కదా.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus