నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది అంటే.. కొన్నేళ్ల క్రితం వరకు ‘నర్తన శాల’ అనే పేరు వినిపించేది. ఆ సినిమాను విజయవంతంగా ప్రారంభించారు. అయితే తర్వాతే ఏదేదో జరిగింది, ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు బాలయ్య నోట మరో సినిమా పేరు వినిపించింది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఓ వ్యక్తి జీవితాన్ని సినిమాగా తీసుకురావాలి అని అనుకుంటున్నాను అని తెలిపారు. అతనే ‘చంఘీజ్ ఖాన్’. దీంతో ఈ సినిమా మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
‘చెంఘీజ్ ఖాన్’ సినిమా చేయడం నా జీవితాశయం అంటూ శుక్రవారం రాత్రి నందమూరి బాలకృష్ణ తన మనసులోని మాట ఘనంగ బయటపెట్టారు. సమయం వచ్చినప్పుడు ఆ సినిమా కచ్చితంగా చేస్తానని కూడా చెప్పారు. ప్రపంచంలోనే పేరు పొందిన మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చెంఘీజ్ ఖాన్. ఈశాన్య ఆసియాలోని ఓ సంచార జాతికి చెందిన అతడి అసలు పేరు టెమూజిన్. మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించి.. దాని విస్తరణ కోసం ఎన్నో దండయాత్రలు చేశాడని చరిత్ర చెబుతోంది.
ఏదైనా రాజ్యంపై చెంఘీజ్ ఖాన్ దాడి చేస్తే అక్కడి ప్రజలపై అతడి సైన్యం క్రూరత్వం ప్రదర్శించేదని అంటారు. మహిళలను ఎత్తుకు వెళ్లిపోయేవాళ్లని చారిత్రక రచనల్లోని ఉంది. ఈ క్రమంలో చాలా మంది రాజులు సామంతులుగా మారిపోయేవారట. అయితే చెంఘీజ్ ఖాన్ గురించి, అతడి సామ్రాజ్యం గురించి ఎక్కడా సరైన సమాచారం లేదు. ఇలాంటి ప్రతినాయక లక్షణాలు ఉన్న వ్యక్తిపై సినిమా చేయాలని బాలయ్య అనుకోవడంతోనే ఆసక్తి మొదలైంది. చెంఘీజ్ ఖాన్ అంటే విలనా? ఆయన జీవితంలో ఇంకో కోణం ఉందా? అనే ఆలోచనతోనే బాలయ్య ఆ సినిమా అంటున్నారు అని చెబుతున్నారు.
అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కూడా ప్రశ్నే. అయితే దానికి క్రిష్ పేరు పరిశీలిస్తున్నారని కూడా వార్తలు మొదలయ్యాయి. ఆయనకు ఇలాంటి సినిమాలు తీయడం ప్రవేశం ఉంది కూడా. విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాస్తే బాగుంటుందని కూడా చెబుతున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వం చేస్తే బాగుంటుందనే కామెంట్లూ చేస్తున్నారు. ‘నర్తనశాల’ సినిమా తరహాలో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!