Pushpa 2: పుష్ప 2లో అరగుండు తారక్.. అదే అసలు ట్విస్ట్

పుష్ప 2  (Pushpa 2)  ట్రైలర్ విడుదల కావడంతో సినిమా మీద ఆసక్తి మరింతగా పెరిగింది. సుకుమార్ (Sukumar) దృశ్యకావ్యం అయిన ఈ చిత్రంలో ఏదో పెద్ద ట్విస్ట్ ఉండబోతోందని ట్రైలర్‌ చూస్తేనే స్పష్టమవుతోంది. అందులో ప్రత్యేకంగా కనబడిన ఒక లుక్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ (KGF) ఫేమ్ తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) అరగుండు గెటప్‌తో మెడలో చెప్పులదండ ధరించి కనిపించిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన తారక్ పొన్నప్ప పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

Pushpa 2

ఇక అతని పాత్ర ట్రైలర్‌లో కేవలం కొన్ని సెకన్లపాటు కనిపించినా, ఆ గెటప్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచింది. సుకుమార్ ఈ పాత్రను పుష్పరాజ్ జీవితంలో కీలక మలుపు తిప్పే విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తారక్ పొన్నప్ప ఇదివరకే ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన పాత్ర పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ కలిగినదని చెప్పాడు. అలాగే, ఈ క్యారెక్టర్ పుష్పరాజ్ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని వెల్లడించాడు.

తారక్ పొన్నప్ప గతంలో కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్టుల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సత్యదేవ్ (Satya Dev) కృష్ణమ్మ (Krishnamma) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తారక్, అనంతరం దేవర (Devara) సినిమాతో మరింత బిజీ అయ్యాడు. పుష్ప 2లో తన పాత్రకు వచ్చిన గుర్తింపుతో టాలీవుడ్‌లో తారక్‌కు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశముందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

పుష్ప 2 ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషల్లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇందులో అల్లు అర్జున్(Allu Arjun) , ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil), జగపతిబాబు (Jagapathi Babu), రష్మిక మందన (Rashmika Mandanna) పాత్రలు ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మహేష్ బాబు న్యూ లుక్.. ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus