ఆదివారం నాడు జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీద పోటీ పడి అధ్యక్షుడిగా గెలిచారు మంచు విష్ణు. మంచు విష్ణు ప్యాన్ లో ఎక్కువ మందికి ‘మా’లో పదవులు దక్కాయి. ఈ క్రమంలో మంచు విష్ణు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి.. పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో చిరంజీవి తనను ఎలెక్షన్స్ నుంచి తప్పుకోమని చెప్పారని.. ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పిన విషయాన్ని మీడియాతో చెప్పారు మంచు విష్ణు.
అలానే రామ్ చరణ్ పేరుని కూడా ప్రస్తావించారు. కచ్చితంగా చరణ్ తన ఓటు ప్రకాష్ రాజ్ కి వేసి ఉంటారని.. ఆ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని.. చరణ్ తన తండ్రి మాట కాదనలేరని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన బండ్ల గణేష్.. మంచు విష్ణు తీరుని తప్పుబట్టారు. తన స్పీచ్ లో చిరంజీవి, రామ్ చరణ్ పేర్లను మంచు విష్ణు ప్రస్తావించడం కరెక్ట్ కాదని.. ఇలా మాట్లాడిన తరువాత శ్రీకాంత్ కూడా తన ప్యానెల్ లో పని చేయలేరని..
నాకు తెలిసిన శ్రీకాంత్ అయితే ఇక మంచు విష్ణుతో కలిసి పని చేయడు, రాజీనామా చేస్తాడని సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో పెద్దలకే పెద్ద దిక్కు చిరంజీవి గారని.. అలాంటి వ్యక్తిని ఎలా అంటరాని ప్రశ్నించారు.