Bandla Ganesh, Jr NTR: ఎన్టీఆర్ తో వివాదాలు స్పందించిన బండ్ల గణేష్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా పలు సినిమాలలో నటించినటువంటి బండ్ల గణేష్ ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాతగా మారిపోయారు. ఇక ఈయన తన రెండవ సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం లభించింది అయితే తీన్మార్ సినిమా చాలా డిజాస్టర్ గా మిగలగా గబ్బర్ సింగ్ సినిమా మాత్రం తనకు మంచి సక్సెస్ అందించింది ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలకు నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించారు. ఇక ఈయన చివరిగా ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి టెంపర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక ఈ సినిమా తర్వాత బండ్ల గణేష్ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే టెంపర్ సినిమా విషయంలో ఈయనకు అలాగే రైటర్ వక్కంతం వంశీ మధ్య జరిగిన గొడవ గురించి తాజాగా ప్రస్తావనకు రావడంతో బండ్ల గణేష్ ఈ విషయంపై స్పందిస్తూ ఎన్నో విషయాలను వెల్లడించారు. వక్కంతం వంశీ రెమ్యూనరేషన్ విషయంలో బండ్ల గణేష్ కోర్టుకి కూడా వెళ్లారు. ఇక ఈ వివాదం కారణంగానే బండ్ల గణేష్ ఎన్టీఆర్ మధ్య కూడా మాటలు లేవు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా (Bandla Ganesh) బండ్ల గణేష్ స్పందిస్తూ పలు విషయాలు తెలియజేశారు. నాకు ఎన్టీఆర్ కి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేవు అని ఈయన తెలిపారు. ఈ సినిమా తరువాత నేను ఎన్టీఆర్ ను పలు సందర్భాలలో కలిసాను అని ఈయన వెల్లడించారు. నాకు ఎన్టీఆర్ కి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాను టెంపర్ సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ మరి ఇంత గ్యాప్ వస్తుందని అసలు అనుకోలేదని త్వరలోనే మంచి సినిమా ద్వారా మీ ముందుకు రాబోతున్నానని తెలిపారు. ఇప్పటికీ కొన్ని స్టోరీస్ వింటున్నానని త్వరలోనే తన సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియచేస్తాను అంటూ బండ్ల గణేష్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus