Bandla Ganesh,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయే వేరు: బండ్ల గణేష్

బండ్ల గణేష్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చాలా సంతోషంతో ఉన్నారు ఇలా ఈయన మద్దతు తెలియజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బారాస నాయకులపై కూడా సెటైర్స్ వేస్తూ కామెంట్లు చేశారు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల కూడా బండ్ల గణేష్ చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంతో అభిమానం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావిస్తూ ఉంటారు.

ఇలా నా ఆరాధ్య దైవం అంటూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై పొగడ్తలు కురిపించే బండ్ల గణేష్ ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మద్దతు తెలియజేస్తున్నానని ప్రకటించలేదు కానీ రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉండాలని మాత్రం కోరుకుంటున్నారు అయితే తాజాగా తెలంగాణ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపొందకపోవడంతో మరోసారి నిరాశ ఎదురయింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని తెలిపారు. ఆయనని నేను ఎక్కడో చూడాలనుకుంటున్నాను ఆయన స్థాయి వేరు కానీ ఆయన మాత్రం ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు అంటూ కామెంట్లు చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో పోలుస్తూ పవన్ కళ్యాణ్ పై మరికొన్ని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తాత తండ్రి ఎవరూ కూడా రాజకీయాలలోకి రాలేదు కానీ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.

రేవంత్ రెడ్డి లాగే మీరు కూడా రాజకీయాలలో ఎదగాలని మిమ్మల్ని తాను ఎక్కడో చూడాలనుకుంటున్నానని ఈ సందర్భంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా ఎదగాలని కోరుకునే బండ్ల గణేష్ ఎప్పుడు కూడా తన మద్దతు జనసేనకు తెలియజేయకపోవడం గమనార్హం.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus