Bandla Ganesh: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. పవన్ కు అందుకే దూరమయ్యారా?

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ భక్తుడిలా అభిమానిస్తాడు. పవన్ సినిమాల ఈవెంట్లలో బండ్ల గణేష్ చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే త్రివిక్రమ్ వల్ల పవన్ బండ్ల గణేష్ మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బండ్ల గణేష్ సైతం పరోక్షంగా పలు సందర్భాల్లో ఈ విషయాలను అంగీకరించారు. తాజాగా పవన్ అభిమాని ఒకరు ట్విట్టర్ లో ” బండ్ల గణేష్ అన్న పవన్ అన్నకు నీ అపార్థాల వల్ల దూరంగా ఉండకు..

ఒంటరిగా ఉంటున్న వ్యక్తికి నీలాంటి వాళ్లు రిలీఫ్.. సమయం దొరికినప్పుడు పవన్ ను కలువు.. పవన్ ను అర్థం చేసుకోలేక చాలామంది సన్నిహితులు దూరం అయ్యారు.. మీరు అలా కావద్దు” అని పేర్కొన్నారు. బండ్ల గణేష్ సమాధానమిస్తూ “మన దేవుడు మంచివాడు కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్” అని పేర్కొన్నారు. త్రివిక్రమ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం. బండ్ల గణేష్ పోస్ట్ కు భారీ స్థాయిలోనే లైక్స్ వచ్చాయి.

బండ్ల గణేష్ సినీ నిర్మాణ రంగంలో బిజీ కావాలని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ బండ్ల గణేష్ మధ్య గ్యాప్ కు కారణమేంటనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ బండ్ల గణేష్ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

బండ్ల గణేష్ వివాదాలకు దూరంగా ఉంటే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ బండ్ల గణేష్ మధ్య సమస్యలు తొలగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus