‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు,ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను నమోదు చేయడమే కాకుండా పండుగ లాంటి సినిమా ఇది అనే ఫీలింగ్ ను కలిగించింది.
దాంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
11.00 cr
సీడెడ్
6.30 cr
ఉత్తరాంధ్ర
4.14 cr
ఈస్ట్
2.88 cr
వెస్ట్
2.60 cr
గుంటూరు
3.24 cr
కృష్ణా
2.70 cr
నెల్లూరు
1.45 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
34.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.00 Cr
ఓవర్సీస్
2.00 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
38.31 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ చిత్రానికి పోటీగా ‘రౌడీ బాయ్స్’ ‘హీరో’ ‘సూపర్ మచ్చి’ వంటి చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి కాబట్టి.. క్యాష్ చేసుకోవడానికి చాలా అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. కరోనా థర్డ్ వేవ్ కు జనాలు భయపడి థియేటర్లలో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ హిట్ టాక్ వస్తే జనాలు ‘బంగార్రాజు’ కి తరలివచ్చే అవకాశం ఉంది.