స్టార్ హీరో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ బంగార్రాజు జనవరి 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. పండుగకు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదలవుతాయని భావించిన అభిమానులు బంగార్రాజు, చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో రిలీజవుతుండటంతో నిరాశకు గురవుతున్నారు. అయితే పండుగకు పెద్దగా పోటీ లేకపోవడంతో బంగార్రాజు 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఐదేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయన తక్కువ టికెట్ రేట్లతో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో బంగార్రాజు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు సాధించడం కష్టం కాదు.
అయితే పెరుగుతున్న కరోనా కేసులు మాత్రం బంగార్రాజు మేకర్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేయకపోవడం బంగార్రాజు సినిమాకు ప్లస్ అవుతోంది. తాజాగా బంగార్రాజు మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. భోగి పండుగ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా నిడివి 160 నిమిషాలు అని సమాచారం. నాగార్జున చైతన్య పాత్రలు కొత్తగా ఉంటాయని చైతన్య కృతిశెట్టి మధ్య వచ్చే రొమాన్స్ సీన్లు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.
సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. బంగార్రాజు మూవీ సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ అని సినిమాలో వీ.ఎఫ్.ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. కృతిశెట్టి ఈ సినిమాలో తెలివైన అమ్మాయి అనుకునే అమాయకురాలిగా కనిపిస్తారని కళ్యాణ్ కృష్ణ వెల్లడించారు. ఏ సినిమా చేసినా ఎమోషన్ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని కళ్యాణ్ కృష్ణ కామెంట్లు చేశారు.
పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఆలోచన లేదని తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తానని కళ్యాణ్ కృష్ణ అన్నారు. నాగార్జున, నాగచైతన్య ఖాతాలో ఈ సినిమాతో మరో సక్సెస్ చేరినట్టేనని రిలీజ్ కు ముందే కామెంట్లు వినిపిస్తున్నాయి.