నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన బంగార్రాజు మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా బుల్లితెరపై జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాగా బుల్లితెరపై కూడా ఈ సినిమా రేటింగ్ విషయంలో అదరగొట్టింది.
బుల్లితెరపై ఈ సినిమాకు ఏకంగా 14 టీఆర్పీ వచ్చింది. బంగార్రాజు టీఆర్పీ మరీ అద్భుతంగా లేకపోయినా ఈ మధ్య కాలంలో నాగ్ నటించిన సినిమాలలో ఈ సినిమాకే ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం. టాప్ 10 జాబితాలోకి ఈ సినిమా చేరకపోయినా ఈ రేటింగ్ నాగ్ అభిమానులకు మాత్రం ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరీ భారీ బడ్జెట్ సినిమాలతో ఈ సినిమాను పోల్చి చూడకూడదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున, నాగచైతన్య ఈ సినిమాలో మాస్ రోల్స్ లో కనిపించి మెప్పించారు.
సర్పంచ్ నాగలక్ష్మి పాత్రలో కృతిశెట్టి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బంగార్రాజు మూవీ ఏపీ, సీడెడ్ లో బాగానే కలెక్షన్లను సాధించగా నైజాంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. నైజాంలో మంచి థియేటర్లు ఈ సినిమాకు దక్కకపోవడం వల్లే నైజాం కలెక్షన్లపై కొంతమేర ప్రభావం పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బంగార్రాజుతో పాటు మరో రెండు సినిమాలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లుగా బుల్లితెరపై ప్రసారమయ్యాయి. స్టార్ మా ఛానల్ లో అశోక్ గల్లా నటించిన హీరో ప్రసారం కాగా ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ వచ్చింది.
అదే సమయంలో మరో ఛానల్ లో నూటొక్క జిల్లాల అందగాడు ప్రసారం కాగా ఈ సినిమాకు 1 రేటింగ్ వచ్చింది. ఓటీటీల హవా అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ ప్రభావం టీఆర్పీలపై పడుతోందని కామెంట్లు వినిపిస్తోంది. నాగ్, నాగచైతన్య తర్వాత సినిమాలతో కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.